అధ్యక్షులు జెట్టి.ధర్మరాజు తీవ్రంగా ఖండించారు…నాగర్ కర్నూల్ రూరల్ ఫిబ్రవరి11(జనంసాక్షి):నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ ఫోరం మరియు కెవిపిఎస్ తెలంగాణ దండోరా మాల మానాడు.మహిళా సంఘాలు దళిత సంఘాలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు జెట్టి.ధర్మరాజు పాల్గొని అంబేద్కర్ కు పూలమాలవేసి మాట్లాడాడు మానవ హక్కుల మహానేత రాజ్యాంగం పితాన్మహుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను ఆరోజు నేను బతికే ఉండుంటే ఉండుంటే అంబేద్కర్ను చంపేవాని ఒక అజ్ఞాని అయినా అమర ప్రసాద్ సోషల్ మీడియాలో చెప్పడం కోట్లాది దళిత బహుజనుల హిందువుల దేశ ప్రజలను అవమానించడమే కాక అఘోరపరిచి కించపరచడంగా మాట్లాడడం ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ పురం రాష్ట్ర అధ్యక్షులు జెట్టి.ధర్మరాజు తీవ్రంగా ఖండించారు.అమర్ ప్రసాద్ ను అరెస్టు చేసి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు తోపాటు పీడీ యాక్ట్ కింద దేశద్రోహులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఈ సంఘటన కులాలకు పార్టీలకు మతాలకు సంఘాలకు అతీతంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు ఇలాంటి సంఘటనలు వృతం రుణావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు లేని పక్షంలో దేశ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించాడు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అంతటి.కాశన్న తెలంగాణ దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపి మహిళా సంఘం నాయకురాలు రేణుక,లక్ష్మి,బాలమణి,ప్రభాకర్ బీసీ సంఘం నాయకుడు వెంకటయ్య ఎంఆర్పిఎస్ నాగరాజు,మాల మహానాడు నాయకుడు ప్రభాకర్,హమలి సంఘం లీడర్ రవి అన్ని ప్రజా సంఘాలు దళిత సంఘాలు పాల్గొన్నాయి తదితరులు పాల్గొన్నారు.




