Wednesday, 4 November 2026

మచ్చలేని నాయకుడు ప్రజా సేవకుడు శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్

 

 

 

 

 

 

 

-బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నిమ్మనగొట్టు నాగభూషణండోర్నకల్ ఫిబ్రవరి-11/ జనం సాక్షి న్యూస్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహించిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర లో డోర్నకల్ శాసనసభ్యుడు డిఎస్ రెడ్యా నాయక్, మానుకోట పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత వాళ్ల కుటుంబం పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని,ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని గొల్లచర్ల బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నిమ్మనగొట్టు నాగభూషణం హెచ్చరించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మచ్చలేని నాయకుడు ప్రజా సేవకుడు,నిత్యం డోర్నకల్ నియోజవర్గ ప్రజలకు మమేకమవుతూ 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రజా క్షేమం కోరే ప్రజాభివృద్ధి ప్రదాత, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రజా అభిమన్యుడు ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అవినీతికి పాల్పడినట్టు రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఆయన ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ భూములు కబ్జా చేశారని రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని అన్నారు. ప్రజా నాయకుడైన రెడ్యా పై తప్పుడు ఆరోపణలు చేస్తే తగ్గిన గుణపాఠం చెప్పడానికి బిఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నామని అన్నాను.వచ్చేఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని,ఎవరు అవినీతిపరుడో ప్రజలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు.