అంబేద్కర్ ప్రపంచ మేధవి ఆయను ఆదర్శనంగా తీసుకోవాలి మున్సిపాల్ చైర్మన్ మనోరమ అలంపూర్ జనంసాక్షి (డిసెంబర్ 06)*డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత దేశనికి మార్గం చూపిన మహమేధావి, అయన ప్రపంచమేధవి అయ్యాడు, అందుకే ఆయనను ఆదర్శంగ తీసుకోవాలి అని అలంపూర్ మున్సిపల్ చైర్మన్ మనోరమ అన్నారు. అలంపూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యలయంలో డాక్టర్ బిఆర్ .అంభేడ్కర్ వర్ధంతి సందర్భముగా మంగళవారం అంభేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భముగా చైర్ పర్సన్ మనోరమ మాట్లాడుతు దళితజాతి సముద్ధారకుడిగా,సమసమాజ స్థాపకుడిగా,న్యాయశాస్ర్త పారంగతుడిగా,పరిపాలనదక్షుడిగా,అంటరానితనం నిర్మూలనకు అవిశ్రాంతంగా పోరాడిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు. అంతే కాకుండా చైతన్యదీప్తి,ఆచరణలో స్వేచ్ఛ,సమానత్వం సౌభ్రాతృత్వాలకు సముచితస్థానం కల్పించడం కోసం కృషిచేసిన విప్లవకారుడు,భౌద్ధధర్మపునరుద్ధరణకర్త,తత్వవేత్త,చరిత్రకారుడు ఆయన అన్నారు.రచయిత,అభ్యుదయవాది,ఆదర్శప్రాయుడు,అట్టడుగువర్గాల ఆశాజ్యోతి,ప్రపంచమేధావి,ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న మహామనిషి భరతమాత ముద్దుబిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అన్నారు.దేశస్వాతంత్రం కోసం పోరాడిన దేశభక్తుడు మన అంభేడ్కర్అన్నారు.స్వాతంత్ర అనంతరం భారత రాజ్యంగ రచన సంఘం అధ్యక్షుడిగా దేశానికి విశిష్ఠమైన సేవలు అందించిన మేధావి అయన అన్నారు.
దళితుల అభివృద్ధి కొరకు కెసిఆర్ పలు సంక్షేమ పథకాలను చేపట్టారు అన్నారు.దళితబంధు పథకము, దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదిఅన్నారు.
అతి ఎత్తైన అంభేడ్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారు అన్నారు. మన ఎమ్మెల్యే అబ్రహాం ప్రతి గ్రామంలోని దళితులు చదువుకొని ఆర్థికంగా ,సమాజికంగా ఎదగాలని నిరంతరం చెబుతున్నారు అన్నారు.
అందుకు చక్కటి తోడ్పాటును అందిస్తున్నారు.అని తెలిపారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని కోరారు.
అనంతరం చైర్ పర్సన్ ఎంపీడీఓ కార్యాలయం మరియు సంతోష్ నగర్ లోని అంబెడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ,వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి , నారాయణ ,షరీఫ్ వీఆర్వో లు రామచందర్ ,మద్దిలేటి ,రామాంజనెయులు,లక్ష్మీనారాయణ ,ఖయీంగారు,సురేష్ ,రాజేష్,సామెలు ,బాలరాజు ,అనిల్ తదితరులు పాల్గోన్నారు.
అంబేద్కర్ ప్రపంచ మేధవి ఆయను ఆదర్శనంగా




