Thursday, 5 November 2026

అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు

అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన బోస్లే మోహన్ రావు పాటిల్…
భైంసా రూరల్ డిసెంబర్ 06 జనం సాక్షి

రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి పురస్కరించుకొని స్థానిక భైంసా పట్టణం లోని బస్ స్టాండ్ సమీపం లో గల అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా బోస్లె మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ…
బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితల్లో వెలుగును నింపిన మహనీయుడు డా. బి. ఆర్. అంబేద్కర్ అని, ఈ రోజు మనం స్వేచ్ఛ గా బతుకుతున్నాం.. తిరుగుతున్నాం చదువుకొని గొప్ప, గొప్ప ఉన్నత స్థాయి కి పోతున్నాం అంటే అది అంబేద్కర్ పెట్టిన బిక్ష అని చెప్పొచ్చు, అన్నారు. ప్రజాసౌమ్య దేశంలో అధికారం ప్రజల చేతిలో ఉండాలని కుల, మత, వర్గ లింగ బేధం లేకుండా అందరికి ఓటు హక్కు ను ప్రసాదించిన మహానియుడు, ఈ రోజు అంబేద్కర్ కొందరి వాడు కాదు అందరి వాడు.. అతను ఒక జాతికి నాయకుడు కాదు.. జాతీయ నాయకుడు ఈ రోజు ప్రపంచ దేశాలు సైతం అంబేద్కర్ మేధస్సుకు చేతులెత్తి మరి మొక్కుతున్నారన్నారు. కాబట్టి మనమందరం అంబేద్కర్ గారి ఆశయాలను సాధించే దిశగా పని చేయాలనీ కేంద్ర ప్రభుత్వం పంచతిర్దల పేరుతో అంబేద్కర్ గారి జీవిత చరిత్రని ప్రపంచానికి చాటి చెప్పేలా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని మన ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం హైదరాబాద్ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని ద్వ0సం చేపించిన ఘనత మన దొర కె దక్కుతుందని ఈ సందర్బంగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో శుభాష్ పాటిల్, అసెంబ్లీ కన్వీనర్ సాయి నాథ్ తాడేవర్,బీజేవైఎం నాయకులు రామకృష్ణ, సారథి, అమృత్, మాణిక్ దగడే తదితరులు పాల్గొన్నారు