అంబేద్కర్, ఫూలే ఆశయ సాధనకు కృషి చేయాలి
–డీఎస్పీ రఘుజహీరాబాద్ జనవరి 18 (జనం సాక్షి) అంబేద్కర్, ఫూలే మహనీయుల ఆశయాల సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని, రాజ్యాంగ రక్షణ ప్రజలందరి బాధ్యత అని జహీరాబాద్ డీఎస్పీ రఘు అన్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం 2023 మహనీయుల క్యాలెండర్ డిఎస్పీ కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఎస్పి రఘు మాట్లాడుతూ.. మహనీయుల ఆశయాలు,లక్ష్యాలు ప్రతిబిమించే విధంగా మహనీయుల ఫోటోలు నినాదాలతో కేవీపీఎస్ క్యాలెండర్ తీసుకురావడం అభినందనీయమన్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా సమాజంలోని వివక్ష అసమానతలు తొలగిపోలేదన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందన్నారు. ముఖ్యంగా మహిళలు ఉన్నత పదవులలో ఉండడానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమని.. నేడు తాను ఈ పదవిలో ఉండ డమే అందుకు నిదర్శనమన్నారు. అంబేద్కర్, పూలే వంటి మహనీయుల ఆశయాల సాధనలో యువత ముందుడాలని వారి స్ఫూర్తిని అలవర్చుకోవాలన్నారు….. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మంచి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. కేవీపీఎస్ జిల్లా సహాయకార్యదర్శి జి మహేష్, మాట్లాడుతూ…. మహనీయులు అంబేద్కర్, పూలే, కారల్ మార్క్స్, పెరియార్, నారాయణగురు, సాహు మహారాజ్, నెల్సన్ మండేలా ప్రజల కోసమే జీవితాంతం నిస్వార్థంగా సేవ చేసిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు ఎస్ఆర్ శంకరన్,కృష్ణన్ చిత్రపటాలు నినాదాలతో కేవీపీఎస్ క్యాలెండర్ తీసుకువచ్చామన్నారు. వారి ఆశయసాధనకు కేవీపీఎస్ నిరంతరం కృషి చేస్తున్న దన్నారు.ఈ కార్యక్రమంలో సమత సైనిక్ దళ్ డివిజన్ అధ్యక్షులు కర్ణం రవికుమార్, బి రాములు, సమతసైనిక్ దళ్ నాగపూర్ అనుబంధసంస్థ జహీరాబాద్ అసెంబ్లీ ప్రెసిడెంట్ ,ఎస్ఎఫ్ఐ జహీరాబాద్ ఏరియా కార్యదర్శి రాజేష్, ఎస్ఎఫ్ఐ ఏరియా ఉపాధ్యక్షులు దుర్గాప్రసాద్,ఎస్ఎఫ్ఐ నాయకులు చంద్రవర్ధన్ ,అతిక్,రఘు,మల్లేష్, సాయి,కెవిపియస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్, ఫూలే ఆశయ సాధనకు కృషి చేయాలి




