– రహ్మత్ అలీ
జహీరాబాద్ జనవరి 18 (జనం సాక్షి) పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పని చేస్తున్న జంగం గోపన్నపై సస్పెన్షన్ ఎత్తివేయాలని బీజేపీ నాయకుడు రహ్మత్ అలీ బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలని డిమాండ్ చేశారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ కేంద్ర నాయకత్వానికి లేఖను రాసి జహీరాబాద్ పోస్టాఫీస్ వద్ద బుధవారం పోస్ట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రోటోకాల్ పాటించని కారణంగా జరిగిన వివాదం వల్ల పార్టీలో నూతనంగా చేరిన చింతల్ ఘట్ సుధీర్ అనే వ్యక్తితో వివాదం జరిగింది అన్నారు. వారు రెచ్చగొట్టి బాధితుల మాదిరి నటించారని వివరించారు. పార్టీ ఇరు పక్షాల వివరణ తీసుకొని సస్పెండ్ చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఏక పక్ష నిర్ణయంతో పార్టీకి నష్టం వాటిల్లుతుంది అని అభిప్రాయపడ్డారు. కేంద్ర నాయకత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జంగం గోపన్న పై సస్పెన్షన్ ఎత్తి వేయాలిజంగం గోపన్న పై సస్పెన్షన్ ఎత్తి వేయాలి




