బిచ్కుందలో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
బిచ్కుంద డిసెంబర్ 06 (జనంసాక్షి)
పేదింటి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మీ పథకం వరంలాంటిదని ఎంపీపీ అశోక్ పటేల్ నాల్చర్ రాజు అన్నారు. మంగళవారం నాడు మండలకేంద్రంలోని స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణలో శాంతాపూర్ గ్రామ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ, జడ్పీటీసీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకంతో నిరుపేద యువతుల వివాహాలు సంతోషంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ పటేల్, ఎంపీటీసీ చంద్రకళ, వెంకట్రావు దేశాయ్, మెక్కా నవాజ్, చిన్న దడ్గి విఠల్ రెడ్డి, హాజీ లక్ష్మణ్ మరియు రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
బిచ్కుందలో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ




