అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు

జనంసాక్షి, మంథని : ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున కార్గే నిన్న చేవెళ్ల లో జరిగిన ప్రజా జర్జన సభలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు సోమవారం మంథనిలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మంథని డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, ఎస్సీ సెల్ మంథని మండల అధ్యక్షులు మంథని రాకేష్ ఆధ్వర్యంలో..మంథని చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. భారతదేశం లోని బడుగు బలహీన వర్గాల ప్రజల కష్టాలని నెరవేర్చిన పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని, ప్రజాగర్జనలో ప్రకటించిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో ఉన్నటువంటి అంశాలను రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ను విజయవంతంగా అమలు చేస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శశి భూషణ్ కాచే, ఓడ్నాల శ్రీనివాస్, పోలు శివ, వేల్పుల రాజు, పేర వేన లింగయ్య యాదవ్, రావికంటి సతీష్, గోటుకారి కిషన్ జి, కుడుదుల వెంకన్న, బూడిద శంకర్, ఊదరి శంకర్, రామ్ రాజశేఖర్, తోకల మల్లేష్, దొర గొర్ల శ్రీనివాస్ యాదవ్, మంథని సురేష్, పార్వతి కిరణ్, లైసెట్టి రాజు, కొఠారి బాపు, మాచిడి రవితేజ గౌడ్, అక్కపాక సదయ్య, తాటి వెంకటేష్ గౌడ్, మంథని శ్రీనివాస్, రోడ్డ రాజేశ్వరరావు, పొన్నగంటి రమేష్, జనగాం సడవలి, గంట బాలయ్య, ఆగ రమేష్, కాటం నారాయణ, అక్కపాక సంపత్, పోగుల సాగర్, అంకుస్, రాజయ్య, రాపల్లి సమ్మయ్య, పంచిక కుమార్, పంచిక దేవేందర్, అరేల్లి కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.