భారతరత్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంపీపీ నివాళి
జూలూరుపాడు, డిసెంబర్ 6, జనంసాక్షి: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ లావుడియా సోనీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అవిరళ కృషి చేశారని కొనియాడారు. ప్రపంచ మేధావి, సంఘ సంస్కర్త, శాస్త్రవేత్తగా కీర్తిగాంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడిని అన్నారు. ఈ కార్యక్రమములో టిఆర్ఎస్ నాయకులు మోదుగు రామకృష్ణ, ఎస్ కె మహబూబ్ పాషా, పనితి వెంకటేశ్వర్లు, దేవరకొండ కిరణ్, మాడుగుల నాగరాజు, మిరియాల కిరణ్, పోతురాజు నరసింహారావు, బాబులాల్, కాకటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.




