అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం-గ్రామ పంచాయితీ సిబ్బంది నిరసన
బోయిన్ పల్లి జులై 11 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రంలో మంగళ వారం రోజున గ్రామపంచాయతీ సిబ్బంది సమ్మెలో భాగంగా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు బోయిన్ పల్లి మండల కేంద్రము లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. అనంతర సిఐటియు జిల్లా కమిటీ ఎల్లారెడ్డి, మండల అధ్యక్షులు అక్కనపల్లి లక్ష్మయ్య ,మండల కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మండల గ్రామ పంచాయతీ సిబ్బంది తో కలసి నిరసన వ్యక్తం చేసారు.