జనం లోకి జనంసాక్షి సర్వే

 అలంపూర్ జూలై 11(జనంసాక్షి )తెలంగాణ రాష్ట్రములో రానున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న సమయం లో మంగళవారం నిజాన్ని నిర్భయంగా నిగ్గు తెల్చే జనంసాక్షి ముందస్తు సర్వే అలంపూర్ నియోజకవర్గం లోని ఐజ లో ఎడిటర్ రహేమాన్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈసందర్బంగా ఎడిటర్ రహిమాన్ మాట్లాడుతూ అలంపూర్, గద్వాల్ నియోజకవర్గలలో చేసే సర్వే ప్రజల అభిప్రాయం మేరకు అడిగి సర్వే పత్రంలో నమోదు చెయ్యాలి అన్నారు. ఏరాజకీయ పార్టీ అనుకూలంగా కాని వ్యతిరేకంగా కాని సర్వే ఉండరాదు అన్నారు. జనంసాక్షి అంటే నమ్మకానికి ప్రతి రూపం అన్నారు.ఈసర్వేలో ఇంచార్జి సాదిక్, రిపోర్టర్లు మల్దకల్ శ్రీనివాస్, రాజోలి అనిల్,ఐజ మహీందర్,గట్టు నరసింహ, అలంపూర్ విజయభాస్కర్, గద్వాల్ మోహిద్,వెంకట్రావు కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక సర్వే బృందం పాల్గొన్నారు.

తాజావార్తలు