గౌరవ అధ్యక్షులు దోమ మార్చ్11(జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14 తారీఖున ప్రారంభించడం చాలా సంతోషం. భారతదేశానికి దిశా నిర్దేశం చేసినటువంటి, ఇతర దేశాలకు భిన్నంగా, మన దేశానికి అనుకూలంగా ,మహా గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇనాగరేషన్ చేయడం చాలా సంతోషకరం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా సెక్రటేరియట్ ఏరియాకు అంబేద్కర్ పేరు పెట్టడం కూడా చాలా సంతోషం. అదేవిధంగా దళిత అభివృద్ధి కొరకు దళిత బంధు కార్యక్రమాన్ని దళితులకు అందజేయడంలో కేసీఆర్ గారు ముందస్తు ప్రణాళిక ఎంతో గొప్పదని, ఆయన ఆలోచన విధానం దేశానికే గర్వకారణం అని సంతోషిస్తున్నాం. మోత్కూర్ గ్రామ అంబేద్కర్ యువజన సంఘం తరపున సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు .
అంబేద్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14 తారీఖున ప్రారంభించడం చాలా సంతోషం. సురేష్ మోత్కూర్ అంబేద్కర్ యువజన సంఘం




