సైదాపూర్: జనం సాక్షి ఏప్రిల్ 14; హైదరాబాద్ పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మండల కేంద్రం నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, అంబేద్కరిస్టులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు.ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అంబేద్కర్ లిస్టులు నాయకులు తరలి వెళ్లారు. ముందుగా ఎంపీపీ జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ… దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తాము పాలుపంచుకుంటున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను వ్యాపారస్తులుగా చేయడానికి దేశంలోనే ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టాడని అన్నారు. నేడు దేశమంతా దళిత బంధు కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. దేశంలో ఈ నాయకుడు ఆలోచన చేయని విధంగా 140 కోట్లతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందన్నారు. కెసిఆర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాడని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు ఇందిరా సుధీర్, భాగ్య ఓదెలు, తొంట ఓదెలు, అనిత రవీందర్ రెడ్డి, సర్పంచులు కాయిత రాములు, శిరీష ముకుంద రెడ్డి, పద్మ రవీందర్ రెడ్డి ,సుమలత అశోక్, కొత్త రాజిరెడ్డి, బత్తుల కొమురయ్య ,పద్మజ కొమురయ్య, మాజీ జెడ్పిటిసి బెదరకోట రవీందర్, మాజీ ఎంపీపీ పొడిశేట్టి వెంకటరాజ్యం, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోమారం రాజయ్య , కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి ,ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎల్కపల్లి రవీందర్, ఎంపీ ఓ సురేందర్ ,కానిస్టేబుల్ సంపత్ తరలి వెళ్లిన వారిలో ఉన్నారు.




