భువనగిరి టౌన్ (జనం సాక్షి ):–భువనగిరి పట్టణంలోని స్థానిక డంపింగ్ యార్డ్ నందు జరిగిన ప్రమాదంలో గాయపడిన బాలికను హుటా హుటిన సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించి చైర్పర్సన్ శ్రీ ఎన్నబోయిన ఆంజనేయులు మున్సిపల్ కమిషనర్ శ్రీ బి నాగిరెడ్డి అక్కడున్నటువంటి వైద్య అధికారులను సంప్రదించి అట్టి బాలికకు మెరుగైన వైద్యం అందించవలసిందిగా, చేయవలసిన స్కానింగులు మరియు రిపోర్టులు అన్ని తీయవలసిందిగా కోరగా, సంబంధిత వైద్యాధికారులు స్పందించి బాలికకు మెరుగైన వైద్యం అందించి, ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉందని ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలుపగా వారి కుటుంబ సభ్యులకు తెలియజేసి పరామర్శించడం జరిగింది.




