Wednesday, 4 November 2026

అకాల వర్షంతో పంటకు తీవ్ర నష్టం

రెంజల్‌: మండలంలో ఈ తెల్లవారుజామున బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో చేతికోచ్చే పంటలు నేలపాలయ్యాయి. మరో వారం రోజుల్లోపు కోతకొచ్చే వరి ధాన్యం ఈదురుగాలులకు యాభై శాతానికిపైగా గింజలు నేలపాలయ్యాయి. ఇళ్లపై కప్పులు గాలికి ఎగిరిపడ్డాయి. విద్యుత్తుస్తంభాలు నేలకు ఒరగడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సుమారు 500 ఎకరాలకు పైగా భూముల్లో పంటనష్టం జరగ్గా వ్యవసాయ, రెవెన్యూశాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *