Wednesday, 4 November 2026

అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులకు.50.000 నష్టపరిహారం వెంటనే చెల్లించాలి -… మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

 

 

 

 

 

 

బచ్చన్నపేట (జనం సాక్షి) వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 50వేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు.బచ్చన్నపేట మండలంలోని కేశిరెడ్డిపల్లి, కొడవటూర్, లక్ష్మపూర్, బండనాగరం, కట్కూరు, గ్రామ రైతులను కలిసి వారి పంటపొలాలు పరిశీలించి . అనంతరం మాట్లాడుతూ. బాధిత రైతులకు నష్టపరిహారం అందే వరకు వారికి అండగా ఉంటానని అన్నారు. అధికారులు సర్వేలు అంటూ కాలక్షేపం చేయకుండా బాధిత రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే స్థానికేతరుడు కాబట్టే ఇక్కడ ప్రజల గురించి రైతుల శ్రేయస్సు గురించి పట్టించుకోవడం లేదని. రైతులు ధర్నా చేసిన కూడా సరైన హామీ ఇవ్వలేకపోయాడని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు నల్లగొని పుష్ప బాలకిషన్, చల్లా సురేందర్ రెడ్డి, గాలి కృష్ణ,రామ్మోహన్ రెడ్డి, మోహన్ రెడ్డి,కరుణాకర్,కొడవటార్ మల్లం శ్రీను, గంగం రామిరెడ్డి,బంధనాగరం నాయకులు కరుణాకర్ రెడ్డి, కుమ్మరి సత్తయ్య,దర్శన్ రెడ్డి, కరుణాకర్, లక్ష్మపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు నూకల భూపాల్ రెడ్డి, నర్సిరెడ్డి, నూకల సోమిరెడ్డి, కట్కూరు నాయకులు చింతల బాలయ్య, మాజీ సర్పంచ్ ఓజాలు, నర్సింహులు,తదితరులు పాల్గొన్నారు.