Wednesday, 4 November 2026

ఘనంగా ఇల్లెందుల రాజు జన్మదిన వేడుకలు

 

 

 

 

 

మెట్పల్లి టౌన్, ఎప్రిల్ 26,జనంసాక్షి:కాంగ్రెస్ పార్టీ మెట్‌పల్లి మండల ఉపాధ్యక్షులు ఇల్లెందుల రాజు జన్మదినాన్ని పురస్కరించుకొని జువ్వాడి భవన్ ( కాంగ్రెస్ పార్టీ మెట్‌పల్లి మండల కార్యాలయం ) లో ఘనంగా వేడుకలు నిర్వహించారు, ఈ సందర్భంగా కేక్ కోసి మిఠాయిలు పంచి పెట్టారు, ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లను పంపిణీ పెట్టారు, ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు డాక్టర్ బెజ్జరపు శ్రీనివాస్ ప్రత్యేకంగా మొక్కను అందించి నాటించారు, తదనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో రానున్నది రాహుల్ గాంధీ రాజ్యం అని రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ రాజ్యమని తెలిపారు, అలాగే కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతతో పనిచేసే ప్రతీ కార్యకర్తకి తగిన ప్రాధాన్యత కలుగుతుంది అని, దానికి ఇల్లెందుల రాజు నిదర్శనం అని అన్నారు, అలాగే ఇల్లెందుల రాజు లాంటి నాయకులకు మరియు కార్యకర్తలకు ముందు ముందు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది అని స్పష్టం చేశారు,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా సేవధల్ అధ్యక్షులు అందె మారుతి బాపూజీ, మైనారిటీ నాయకులు అడ్వకేట్ అబ్దుల్ హఫీజ్, టౌన్ ప్రధాన కార్యదర్శి రామ్ ప్రసాద్‌,ప్రసాద్,ఉదయ్,చోటు . మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,