Tuesday, 3 November 2026

అకాల వర్షం అపార నష్టం. – నేల రాలిన మామిడి. – గుండ్ల సోమారంలో పిడుగుపాటుకు ఎద్దు మృతి. – ప్రభుత్వం ఆడుకోవాలని వేడుకొలు.

 

 

 

 

 

 

 

 

 

బెల్లంపల్లి, ఏప్రిల్ 28, (జనంసాక్షి )బెల్లంపల్లి నియోజకవర్గంలో గురువారం రాత్రి కురిసిన గాలివానకు మామిడి కాయలు నేలరాలి రైతులను తీవ్ర నష్టపరిచాయి. రాష్ట్రంలోనే మామిడి పంటకు పెట్టింది పేరు బెల్లంపల్లి నియోజకవర్గం. నియోజకవర్గ పరిధిలోని నెన్నెల, బెల్లంపల్లి, వేమనపల్లి, కన్నెపల్లి, తాండూర్, బిమిని మండలాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇటీవల వచ్చిన గాలి దుమరానికి యాభై శాతం పంట నష్టపోగా, గురువారం రాత్రి కురిసిన గాలివానకు ఉన్న యాభై శాతం పంట చేతికోచ్చే సమయంలో నేలరాలి, రైతుల ఆశలను నేలరాల్చింది. ఆరుగాలం కష్టపడి ఎంతో శ్రమిస్తే తీరా పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి ప్రకోపానికి పంట నేల రాలడంతో మామిడి రైతులు నిరాశ, నిస్పృహలో ఉన్నారు. నెన్నెల మండలం గుండ్ల సోమారం గ్రామంలో కుర్మిళ్ల బక్కయ్యకు చెందిన ఎద్దు పిడుగుపాటుకు మృతి చెందింది. జడ్పీటీసీ సింగతి శ్యామల రాంచందర్ ఆధ్వర్యంలో పశువైద్యాధికారి దిలీప్ పోస్ట్ మార్టం నిర్వహించి పంచనామా చేశారు. ప్రభుత్వం స్పందించి మామిడి రైతులను, ఇతర రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.