నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.ఆరోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందిన పలువురు పేదలకు,హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహకారంతో సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ వార్డులలో మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయ బాబుతో కలిసి లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి చెక్కులను అందజేశారు..ఈ సందర్భంగా చల్ల శ్రీలతరెడ్డి మాట్లాడుతూ వేలాది మంది పేద,మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా, ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని,నియోజక వర్గంలో,ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, సహకారంతో వందలాది మందికి పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులను అందించినట్లు ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నాగండ్ల శ్రీధర్, గ్రంథాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ,మాజీ సర్పంచ్ ఆకారపు వెంకటేశ్వర్లు,పట్టణ ఉపాధ్యక్షులు పాశం లుకాస్, ప్రచార కార్యదర్శి బుడిగ చంద్రయ్య గౌడ్, సంయుక్త కార్యదర్శి గంట సైదులు, యూత్ ప్రధాన కార్యదర్శి షేక్ ఇస్తియాకు, సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి కొమర్రాజు వెంకట్, పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి కైరున్ బి, బి.శ్వేత, 7వ వార్డు అధ్యక్షులు మామిడి వెంకన్న,15వ వార్డు అధ్యక్షులు టి.శ్రీకాంత్,బిఆర్ఎస్ నాయకులు నక్క గిరిబాబు,షేక్ సైదా,కొమ్ము బిక్షం, ఇంజమూరి శంకర్, కడమంచి జాను, తదితరులు పాల్గొన్నారు…




