బెల్లంపల్లి, ఏప్రిల్ 28, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా ఏరియాలో శుక్రవారం దాతల కోరిక మేరకు జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ అన్ని దానాల్లో కెల్ల అన్నదానం గొప్పదని, ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని అన్నారు. దాతల సహకారంతో ఈకార్యక్రమం గత ఏడాది ఏప్రిల్ 13న ప్రారంభించామని, వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేటితో 171వ సారి అన్నదానం చేసినట్లు తెలిపారు. నేటి కార్యక్రమం జనహిత అన్నపూర్ణ వంట మాస్టర్ నిచ్చకోలా కృష్ణవేణి గురుస్వామి దంపతుల కుమార్తె అంజనా దేవి పుట్టినరోజు సందర్బంగా యాచకులకు, నిరుపేదలకు, కూలీలకు, చిరు వ్యాపారులకు, బాటసారులకు ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్నదానం చేసినట్లు ఆయన వివరించారు. ఈకార్యక్రమం ద్వారా సుమారు 180 మందికి అన్నదానం చేశామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం మరింత మంది దాతలు ముందుకు రావాలని, ఇప్పటిదాకా సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు, జనహిత సేవా సమితి కోశాధికారి కోడిపెళ్లి గిరిప్రసాద్, సహాయ కార్యదర్శులు గోడిశెల శేఖర్, పతంగి సంతోష్, సభ్యులు సింగతి తిరుమల్, గట్టు భీమా గౌడ్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.




