Tuesday, 3 November 2026

అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం వెంటనే అందించాలి – కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సూర సమ్మయ్య

 

 

 

 

 

 

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని కన్నాల, గన్ శ్యాం దాస్ నగర్ గ్రామాల్లో పర్యటించి అకాల వర్షానికి దెబ్బ తిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం అందించాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు సూర సమ్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన వర్షానికి అనేక మంది రైతులు పంటలు నష్టపోయారని ఆయన అన్నారు. మొన్నటి వరకు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నీళ్లు సమయానికి రాక రైతులు ఎన్నో కష్టాలు పడి పంట సాగు చేసుకుంటె తీరా పంట చేతికచ్చే సమయానికి ఈ అకాల వర్షం పడి రైతులు పూర్తిగ నష్టపోయారని వారు అన్నారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు కనీసం వారు పంటల పై పెట్టుబడి కి తీసుకు వచ్చిన అప్పులు తీరే విదంగా అయిన ఎకరానికి 20 వేల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని తడిచిన వడ్లను ఎటువంటి తరుగు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు . ప్రభుత్వం 15 రోజుల ముందే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఈ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల రైతుల నష్టపోయారని వారికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని అన్నారు. పాలకుర్తి మండలంలోని ప్రతి ఐకెపి కొనుగోలు కేంద్రాల్లోని రైతులు పండించిన పంటకు న్యాయం జరిగే వరకు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటంలో ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ గండికోట వెంకటేష్,మాజీ ఉపసర్పంచ్ బాధవత్ శంకర్ నాయక్,కాల్వ తిరుపతి, కొమిరె శంకర్, జీడి నగర్ రైతు సమన్వయ అధ్యక్షులు నామాలు రాయమల్లు,కన్నాల రైతు సమన్వయ అధ్యక్షులు గుండేటి శంకరయ్య,కళావేన శ్రీనివాస్, బోయిని శంకర్,మల్కా చంద్రయ్య,నక్కిరెడ్డి ప్రతాప్ రెడ్డి,మల్కా రాములు,బుర్ర వెంకటస్వామి,పుప్పాల శంకరయ్య,ముత్యాల కనకయ్య,సంపంగి లక్ష్మణ్,పాలకుర్తి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.