జనంసాక్షి , రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిల్ల గ్రామంలో కమాన్పూర్ ప్రాథమిక సహకార సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజలింగు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమాన్పూర్ సహకార సంఘం డైరెక్టర్ జనగామ తార, గ్రామ రైతు బంధు అధ్యక్షుడు పీక ఓదెలు, నాయకులు ముస్కుల పాపిరెడ్డి, తుమాల రాజిరెడ్డి, ఆర్ల మనోజ్, రాకేష్, కనుకుల శంకర్, సహకర సంఘం సీఈవో సంతోష్, ఏఈఓ మృగణయాని, సెంటర్ నిర్వాహకులు సుంకరి బాలకృష్ణ, శ్రీనివాస్, హమాలిలు, గ్రామ పెద్దలు మరియు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




