Tuesday, 3 November 2026

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలితడిచిన ధాన్యం ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలి                                                   

 

 

 

 

– బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్  రెడ్డిజనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని నాగారం, కన్నాల గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలు  బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్  రెడ్డి అడిగి తెలుసుకున్నారు. అనంతరం  ఆయన మాట్లాడుతూ… అకాల వర్షానికి పంట నష్టానికి గురైన రైతులను ప్రభుత్వం వెంటనే అదుకోవాలి,  నష్టం పోయిన రైతులకు ఎకరానికి 50 వేల చెప్పున నష్ట పరిహారం అందించాలి, కొనుగోలు కేంద్రలలో మౌలిక సదుపాయాలు కల్పించి, వర్షలను దృష్ట  టార్పాలిన్ కవర్స్ అందించాలని, ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించకుండ వెంటనే  ధాన్యం  కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీ రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, తరుగు పేరిట రైతులను దోచుకుంటే ఊరుకోం అని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పాసల్ భీమా పథకం మన రాష్ట్ర లో అమలు చేస్తే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు  వచ్చినపుడు ఎంతగానో రైతులకు ఉపయోగ పడేది అలాంటి పథం వస్తే బీజేపీ కి మంచి పేరు వస్తుందని నీచమైన ఆలోచన తో  కెసిఆర్ అ పథకం ప్రవేశ పెట్టడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో  అసెంబ్లీ కో కన్వినర్ నాంపల్లి రమేష్ మండల ఇంచార్జ్ వీరబోయిన రాజేందర్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి బోయిని నారాయణ, సీనియర్ నాయకులు కోరబోయిన మల్లిక్, బూడిద తిరుపతి, చీదురాల మధుకర్ రెడ్డి, ఎల్క సదానందం, దొడ్డిపట్ల శంకర్, కుర్మా శేఖర్,ముసిపట్ల విద్య సాగర్ రెడ్డి, దాసరి శ్రీధర్, చీదురాల సురేందర్ రెడ్డి,పడాల తిరుపతి , మంథని బాపు , మంథని రాజయ్య , చిప్ప శంకర్ , బూడిద వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.