Wednesday, 4 November 2026

అక్రమంగా అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలి

అక్రమంగా అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలి ఏఐఎస్ఎఫ్  హన్మకొండ జిల్లా కార్యదర్శి భాషబోయిన సంతోష్
జనంసాక్షి, హసన్ పర్తి, జనవరి 9: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ “”ఛలో ప్రగతిభవన్”” కార్యక్రమాన్ని బయదేరుటకు సిద్దమైన జిల్లా నాయకులు
జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల చరణ్ యాదవ్, జిల్లా సహాయ కార్యదర్శి హసన్ పర్తి మండలం జయగిరి గ్రామానికి చెందిన కసర బోయిన రవితేజలను వివిధ నాయకులను శాయంపేట మరియు జయగిరి తదితర గ్రామాలలో గాలించి..
అర్థరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించడం జరిగింది.
ఈ సందర్బంగా భాష బోయిన సంతోష్ మాట్లాడుతూ

ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ “”ఛలో ప్రగతిభవన్”” కార్యక్రమానికి బయలుదేరిన వందలాది AISF నాయకులను రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. అరెస్ట్ చేసిన నాయకులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలనీ వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . న్యాయం చేయాలనీ కోరుతున్న విద్యార్థి , యువజన నాయకులను, అభ్యర్థులను అరెస్ట్ చేయడంలో చూపిస్తున్న శ్రద్ధ, ఎస్ఐ,కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్య పరిష్కారంలో చూపిస్తే బాగుండు అని ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం.
1600/800 పరుగు పందెంలో ఉతీర్ణత సాధించిన ఎస్ ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులందరికి మెయిన్స్ పరీక్ష అవకాశం కల్పించాలి.
ప్రిలిమ్స్ ప్రాథమిక మల్టీపుల్ పరీక్షలో తప్పుగా వచ్చిన 7 ప్రశ్నలకు మార్కులు కలపాలని హైకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మెన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి.
ప్రిలిమ్స్ పరీక్షలలో తప్పుగా వచ్చిన ప్రశ్నలన్నింటికీ మార్కులను కలపాలని భాష బోయిన సంతోష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది,ఏఐఎస్ఎఫ్ మరియు ఇతర విద్యార్థి, యువజన సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని తెలిపారు.