పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
గోపాల్ పేట్ జనం సాక్షి జనవరి (09): మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఆదివారం 1985 – 86 సంవత్సరం టెన్త్ బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. విద్యార్థులతోపాటు వారికి పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు చాలా కాలం తర్వాత ఒకచోట కలిశారు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులను విద్యార్థులు పూలమాలతో ఘనంగా సన్మానించి వారికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు అనంతరం ఉపాధ్యాయులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు తోటి స్నేహితులు సెల్ ఫోన్ నెంబర్లను సేకరించారు 36 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులందరూ చదువుకున్న పాఠశాల వద్ద కలుసుకొని పాఠశాలలో చదువుకున్న రోజులలో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సందడి చేశారు వివిధ స్థాయిలలో ఉన్నత స్థాయికి ఎదిగిన విద్యార్థులను చూసి ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందించారు




