Wednesday, 4 November 2026

అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్.ఐ పట్లోళ్ల విద్యా చరణ్ రెడ్డి

 

 

 

 

 

 

 

 

బషీరాబాద్ ఫిబ్రవరి 12, (జనం సాక్షి) వికరాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో ఆదివారం రోజున పోలీసులు విధులు నిర్వహిస్తుండగా తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్న పోలీసులు.వివరాల్లోకి వెళితే స్థానిక ఎస్.ఐ పట్లోళ్ల విద్యా చరణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తుండగా ఇసుక ట్రాక్టర్ నీ పట్టుకొని యజమానిపై అనగా మోహన్ తండ్రి యాకాంబరి వయసు సుమారు 27 సంవత్సరాలు నివాసం మైల్వార్ గ్రామానికి చెందిన వ్యక్తి పై కేసు నమోదు చేసినట్టు స్థానిక ఎస్.ఐ పట్లోళ్ల విద్యా చరణ్ రెడ్డి తెలిపారు.