Wednesday, 4 November 2026

అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత

గుడిహత్నూర్: ఏప్రిల్ 10 (జనం సాక్షి)అక్రమంగా తరలిస్తున్న కలపను పట్టుకొని స్వాధీనం చేసుకున్నామని సి.ఐ
ముదావత్ నైలు తెలిపారు.జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పక్క సమాచారంతో గుడిహత్నూర్ ఎక్స్ రోడ్ వద్ద ఇచ్చోడ సిఐ నైలు,గుడిహత్నూర్ ఎస్సై ప్రవీణ్ కుమార్ రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టగా మండల కేంద్రంలోని హిందుస్థాన్ దాబా సమీపంలో ఒక ఐచర్ అనుమానస్పదంగా కనిపించడంతో నిలిపి ఉన్న వ్యాన్ ను తనిఖీ చేస్తుండగా ఐచర్ వ్యాన్ డ్రైవర్, క్లీనర్ వాహనాన్ని విడిచి పరారయ్యారు.వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 48 టేకు దుంగలు ఉండడంతో వాహనాన్ని పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఎఫ్ఆర్ఓ పాండురంగ్ , సెక్షన్ ఆఫీసర్ కృష్ణ నాయక్, ఎఫ్.బి.ఓ నరసయ్య లు ఐచర్ వ్యాన్ ను స్వాధీనం చేసుకొని ఇచ్చోడ కలుప డిపోకు తరలించారు. ఈ కలప విలువ సుమారు ఐదు లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.ఈ తనిఖీల్లో ఏఎస్ఐ. బలిరాం, కానిస్టేబుల్ విట్టల్ భూమన్న సదాశివ్, పాల్గొన్నారు.