టేకులపల్లి, ఏప్రిల్ 10 (జనం సాక్షి ): ప్రజలకు వెలుగును పంచి మేము చీకట్లో జీవిస్తున్నాం
వేతన సవరణ ఏది సారు…. అంటూ టేకులపల్లి సబ్ డివిజన్లో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులందరూ యాజమాన్య తీరుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని టేకులపల్లి సబ్ స్టేషన్ లో సోమవారం విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై ఈ నెల 17న జరుపు తలపెట్టే సమ్మెకు మద్దతు ప్రకటిస్తూ విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ హాజరుకావాలని టేకులపల్లి సబ్ డివిజన్ నాయకులు హట్కర్ దేవా, ప్రసాద్, జరుపుల రాజేందర్, దేవ్ సింగ్, లక్ష్మీనారాయణలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఆర్టిజన్ సమస్యల గురించి స్పందించాలని, విద్యుత్ ఉద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణి మానుకోవాలని, వెంటనే వేతన సవరణ చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రతిక్షణం ప్రజలకు విద్యుత్ లో ఎటువంటి అంతరాయం లేకుండా వెలుగు పంచేందుకు మేము చీకట్లో జీవిస్తున్నాంమ ని, ప్రభుత్వం విద్యుత్ సంస్థ యజమాన్యం మా సమస్యలు కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.ప్రభుత్వం విద్యుత్ సంస్థ యజమాన్యం విద్యుత్ శాఖ విధులు నిర్వహిస్తున్న మాకు నాలుగు సంవత్సరాలకు ఒకసారి సిబ్బందికి ఇవ్వాల్సిన వేతన సవరణ ఇవ్వడంలేదని,అలాగే విద్యుత్ సంస్థలో ఆర్టిజన్లను న్యాయబద్ధమైన డిమాండ్లను విద్యుత్ సంస్థలు పనిచేస్తున్న 23667 ఆర్టిజన్లను 2017లో రెగ్యులర్ చేశానని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చారని, ఇప్పటివరకు ఆ ప్రక్రియ ముందుకు సాగకపోవడం దారుణం అన్నారు.
ఆర్టిజన్లను కన్వర్షన్ ఇవ్వాలని,ఒకే సంస్థలు వేరు వేరు రూల్స్ లో ఉండకూడదని వారు చెప్పారు.
విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ ఏది సారూ… టేకులపల్లి సబ్ డివిజన్ విద్యుత్ ఉద్యోగుల ఆవేదన




