అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
చింతలమానేపల్లి జనంసాక్షి:మండలంలోని రవీంద్రనాగర్-1గ్రామం మీదుగా మండలంలోని పలు బెల్టుషాపులకు (టిఎస్ 20సి7047)కారు లో అక్రమంగా మద్యాన్ని తరలిస్తునరన్నా ముందస్తు సమచరంతో రవీంద్రనాగర్ వైన్స్ యజమాని జటోత్ సోమేశ్ కారును వెంబడించి స్థానిక పొలీస్ స్టేషషన్ కు సమాచారం ఇవ్వగా హెడ్ కానిస్టేబుల్ సంతోష్ కారును తనిఖీ చేయగా అందులో మద్యం లభించినట్లు హెడ్ కానిస్టేబుల్ సంతోష్ తెలిపారు.దాని విలువ 97 వెలు ఉంటుందని తెలిపారు.అక్రమంగా మద్యం తరలిస్తున్న కౌటాల మండలానికి చెందిన కుంచల కార్తిక్ పై కేసునమోదు చేసి కారును సీజ్ చేసినట్లు తెలిపారు.గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.




