Tuesday, 3 November 2026

బాసర విద్యార్ధులకు హాట్సాఫ్

బాసర విద్యార్ధులకు హాట్సాఫ్..!

– బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఉద్యమ0 తీరు బాగుంది.

– దెబ్బకు కేటీఆర్ దిగి వచ్చాడు.

– ఈటల రాజేందర్.

జనం సాక్షి బైంసా రూరల్ నవంబర్ 30

బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థులకు హ్యాట్సాఫ్..!
బాసర త్రిబుల్ ఐటీ ఉద్యమ స్ఫూర్తి బాగుందని దెబ్బకు కేటీఆర్ దిగివచ్చాడని,హుజరాబాద్ ఎమ్మెల్యే & బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. ఐదో విడత ప్రజాసంగ్రామ భైంసా బహిరంగ సభలో మాట్లాడుతూ…కేసీఆర్ తన చెప్పు చేతల్లో ఉండే పోలీసులతో 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభను అడ్డుకోవాలని చూసాడని,అయిన బహిరంగ సభకు కోర్టు అనుమతి ఇచ్చింది.ఇంతపెద్ద పార్టీ బహిరంగ సభ 2 గంటలే ఉంటుందా సమయం ఇవ్వడం వాళ్ళ బాధ కరం అని,కేసీఆర్ పాలనలో చదువులమ్మ ఒడి అయిన బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థులు తమ హక్కుల కోసం ఉద్యమాన్ని చేశారు.
విద్యార్థుల ఉద్యమంతో కేసీఆర్ కొడుకు కేటీఆర్ దిగి వచ్చాడు.రాష్ట్రా రెసిడెన్షియల్ పాఠశాలలో మంచి భోజనం పెట్టకపోవడం తో.బల్లులు పడ్డ అన్నం తిని, విద్యార్థులు అనారోగ్యం పాలై, హాస్పిటల్ కు వెళ్తున్న పరిస్థితి చూస్తున్నా0 అన్నరు.ప్రజలు నివురు గప్పిన నిప్పులా ఉన్నారు,కేసీఆర్ ను ఓడగొట్టడమే తమ ఎజెండా అని ప్రజలు అనుకుంటున్నారన్నారు.
కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయని,చేతలు మాత్రం గుమ్మం కూడా దాటవని ఏద్ధువ వేశారు.కేసీఆర్ డైరెక్షన్ లో పోలీసులు ఎంతమంది బీజేపీ కార్యకర్తల పై కేసులు పెడతారు అని ప్రశ్న0చారు.తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే,రాబోయే కాలంలో పులి బిడ్డల్లా ఆదిలాబాద్ ప్రజలు బీజేపీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలని కోరుతున్నా అన్నారు.