Tuesday, 3 November 2026

అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లనుపోలీసుల కు

అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లనుపోలీసుల కు పట్టించిన గ్రామస్తులు కొండమల్లేపల్లి డిసెంబర్ 1జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని చింతకుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం రాత్రి సమయంలో అనుమతి లేకుండా మట్టిని తరలించడం జరుగుతుంది ఈ సంఘటన గ్రామంలోని పలువురు వ్యక్తులు మట్టి తరలిస్తున్న టిప్పర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పడం జరిగింది అక్రమంగా తరలిస్తున్న మట్టి టిప్పర్లను పట్టించిన వారు దాసరి రామకృష్ణ శవ్వా శ్రీను రమేష్ గౌడ్ తదితరులు ఉన్నారు ఆయా టిప్పర్లు నక్క విజేందర్ రెడ్డి సంబంధించినట్లుగా గ్రామస్తులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపారు.