Thursday, 5 November 2026

అక్రమవెంచర్లపై నడుం బిగించిన అధికారులు..

అక్రమవెంచర్లపై నడుం బిగించిన అధికారులు…
జనం సాక్షి భైంసా రూరల్ నవంబర్ 23

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని అక్రమ వెంచర్ల పై బుధువారం అధికారుల కోరాడగప్పీ0చారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్రమ వెంచర్ల,సరిహద్దులను తొలగించారు.పట్టణ0లోని నిర్మల్,బై0సా రహదారి లో గల నిబంధనలను అనుసరించి చేయని లేఔవుట్ల సరిహద్దులని తొలగి0చారు.భైంసా మండలం లో మొత్తం 21 పర్మిషన్ లేని వెంచర్ల ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పర్మిషన్ లేని పలు లేఔట్ల గుర్తించి, దశల వారీగా తొలగిస్తున్నట్లు అదికారులు వెల్లడించారు. ప్రజలు పర్మిషన్ ఉన్న లేఔట్లను గమనించి ప్లాట్లను తీసుకోవాలి కానీ పర్మిషన్ లేని లేఔట్లలో ప్లాట్లు తీసుకోవడం ద్వారా ఇబ్బందులు గురవుతారని ఆర్డిఓ రవికుమార్ అన్నారు.
వెంచర్లపై కొరడా విధించిన వారిలో అధికారులు, మున్సిపల్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.