Thursday, 5 November 2026

వైభవంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం

వైభవంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ) : జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా మంగళవారం రాత్రి పార్వతీ పరమేశ్వరుల శాంతి కళ్యాణ వేడుకలను కన్నుల పండువగా, వేదమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు.తెనాలికి చెందిన ప్రముఖ పురోహితులు విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, కౌన్సిలర్ గండూరి రాధిక రమేష్ , ఈఓ లక్ష్మణరావు, డైరెక్టర్ అయ్యన్న , పెద్దలు రాచకొండ దేవయ్య , శివ, జయశంకర్, అర్చకులు వలివేటి వీరభద్ర శర్మ , సాగర్ శర్మ , సునీల్ శర్మ , వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.