Thursday, 5 November 2026

రైతు కుటుంబానికి అండగా రైతు భీమా…..ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్

రైతు కుటుంబానికి అండగా రైతు భీమా…..ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్

సారంగపూర్ (జనంసాక్షి) నవంబర్ 23

 

రైతు కుటుంబానికి అండగా రైతు భీమా పధకం అన్నారు ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్.గురువారం జగిత్యాల ఎమ్మేల్యే క్వార్టర్స్ లో సారంగాపూర్ మండల నాగునురు గ్రామానికి చెందిన రైతు జంగ రవి ఇటీవల మరణించగా రైతు భీమా పధకం ద్వారా మంజూరైన 5లక్షల ప్రొసీడింగ్స్ కాపీ నీ ఈరోజు జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రవి భార్య సంధ్య కు అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు.
అనంతరం మాట్లాడుతూ రైతు ఏ కారణంతో మరణించిన 5 లక్షల భీమా చెక్కును రైతు కుటుంబానికి ముఖ్యమంత్రి గారు అందజేస్తున్నారు అని అన్నారు.రైతు మరణిస్తే కుటుంబం ఒంటరి కాకుండా 5 లక్షల భీమా వారికి అండగా ఉంటుందని అన్నారు..తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రవీందర్ రావు,యూత్ అధ్యక్షుడు మహేష్,మారుతి తదితరులు పాల్గొన్నారు