Tuesday, 3 November 2026

అక్రమార్కులకు అడ్డా జవహర్ నగర్ గడ్డ స్విమ్మింగ్ పూల్ నిర్మాణదారునికి అధికారులు దాసోహం

 

కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) మే 30 :—. జవహర్ నగర్ లో ప్రభుత్వ భూములు పంచగద్దల ఫలహారం కావడానికి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరే కారణమని జవహర్ నగర్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తినడానికి తిండి లేక కట్టడానికి బట్టలేక పొట్ట చేత పట్టుకొని పట్టణానికి వలస వచ్చి కూలినాలి పనిచేసుకుంటూ పూట పూట పస్తులుండి పైసా పైసా కూడబెట్టుకొని పుస్తె మెట్టెలు తాకట్టు పెట్టుకుని జవహర్ నగర్ లో గల 60 గజాల స్థలంలో ఒక చిన్నపాటి గుడిసె నిర్మాణం చేసుకుంటే హుటాహుటిన వచ్చి జెసిబి లతో ఆ గుడిసె నిర్మాణాన్ని తొలగించే రెవెన్యూ అధికారులకు ఇదే జవహర్ నగర్ ప్రభుత్వ భూమిలో విలాసవంతమైన జీవితం గడిపేందుకోసం చట్టం నా చుట్టమే అన్నట్లుగా అధికార పార్టీని అడ్డుపెట్టుకొని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి సభ్యులతో పాటు మంత్రి మద్దతును కూడగట్టుకుని వేల గజాల స్థలాలలో (ఈతకొలను) స్విమ్మింగ్ పూల్ గెస్ట్ హౌస్(అతిథి గృహాల) నిర్మాణాలను యదేచ్చగా పూర్తి చేస్తుంటే ఈ ధనిక బడా బాబుకు అటు రెవెన్యూ అధికార యంత్రాంగం ఇటు మున్సిపల్ అధికార యంత్రాంగం దాసోహం అన్నట్లు వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటీ…? అధికారుల ప్రతాపం తల దాచుకునేందుకు తావుండాలని తపనపడే కూటికి గతి లేని నిరుపేదలపైనే కానీ చట్టానికి సవాల్ విసురుతూ నేనే రాజు నేనే మంత్రి అన్న చందంగా అధికార పార్టీ అండదండలతో మంద బలం ధన బలంతో ఎవరినైనా స్వాసించొచ్చు అనే అహంకారపూరిత ధోరణి అవలంబిస్తూ రిజిస్ట్రేషన్ స్థలాలలో కూడా చేపట్టని విధంగా ప్రభుత్వ స్థలంలో ఇంత పెద్ద తరహాలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేస్తున్న ఈ స్విమ్మింగ్ పూల్ నిర్మాణం అక్రమ నిర్మాణం కాదా ఈ నిర్మాణంపై చర్యలు తీసుకునేందుకు అధికారులకు ఎందుకు ధైర్యం చాలటం లేదు ధైర్యం చాలడం లేదా లేక మేయర్ తండ్రి మంత్రి మల్లారెడ్డి ప్రథమ అనుచరుడని అధికారులు విధి నిర్వహణను మరిచి భయ భీతికి గురవుతున్నారా లేక ప్రభుత్వం ఇచ్చే జీతాల కన్నా ఈ బడా బాబు సమర్పించే పెద్ద ముత్తపు ముడుపులకు ముచ్చటపడి విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారా అని ఆరోపణలు ప్రజల నుండి వెలువడుతున్నాయి ఎలాంటి ఆరోపణలకు తావు లేని ఎడల నిరుపేదల పట్ల ఏ విధంగా అధికారులు విధులు నిర్వహిస్తున్నారో అదేవిధంగా ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వ భూమిలో నిర్మాణమైన ఈ అక్రమ స్విమ్మింగ్ పూల్ నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో తొలగించి చట్టం అనేది పేదవారికైనా గొప్పవారికైనా ఒకటే అని నిరూపించి ప్రజల నుండి వస్తున్న ఆరోపణలకు నివృత్తి కలిగించాలని జవహర్ నగర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఈ స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పట్ల రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని ఎడల ఈ అక్రమ నిర్మాణ వ్యవహారాన్ని అధికారుల నిర్లక్ష్య వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి విధి నిర్వహణలో బాధ్యత రహితంగా వ్యవహరించిన అధికారుల తీరును కలెక్టర్ ముందు ప్రస్తావించి విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చట్టానికి సవాల్ విసురుతూ అక్రమ మార్గంలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేసిన అక్రమార్కుని పై చర్యలు తీసుకునే అంతవరకు ఉపేక్షించేది లేదని బీదలకు ఒక న్యాయం బడాబాబులకు ఒక న్యాయమా అందరికీ సమన్యాయం జరిగేంతవరకు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు