గద్వాల ప్రతినిధి మే 20 (జనంసాక్షి):- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో ఉన్న మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించడనికి వచ్చిన జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ అకస్మాత్తుగా ఆసుపత్రిని సందర్శించారు… డాక్టర్ల,స్టాఫ్ రిజిస్టర్ లను జెడ్పి చైర్ పర్సన్ పరిశీలించారు…అనంతరం వార్డులలో ఉన్న పేషెంట్ లను కలిసి డాక్టర్లు,సిబ్బంది బాగా చుస్తూండ్ర లేదా అని పేషెంట్ లను సరితమ్మ పేషెంట్ లను ఆప్యాయంగా పలకరించి తెలుసుకొని..అనారోగ్యంతో అడ్మిషన్ అయిన వారు ఏఏ వ్యాధి లతో బాధపడుతున్నారో,ఆయా రోగాలకు సంబంధించిన డాక్టర్లు సమయానికి వచ్చిన వైద్యం అందిస్తున్నరా అని పేషెంట్ లను అడిగి తెలుసుకున్నారు.. డాక్టర్లు,సిబ్బంది సమయానికి ఆసుపత్రిలో విధులలో ఉండాలని, అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన బాధితులకు నాణ్యమైన వైద్యం అందించాలని సూపరిడెంట్ డాక్టర్ కిషోర్ కుమార్,సిబ్బంది కి జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ సూచించారు…




