సిరిసిల్ల రూరల్ సిఐ బి. ఉపేందర్రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఫిబ్రవరి.10. (జనంసాక్షి) సిరిసిల్ల రూరల్ సర్కిల్ పరిధిలో అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని సిఐ. బి ఉపేందర్ కోరారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇటీవల ఇల్లంతకుంట మండలం లో కంది కట్కూరు కు చెందిన న్యాత అశోక్ అధికారం లేకున్నా ట్రాక్టర్ ను ఆపి బెదిరింపులకు పాల్పడినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పిడిఎస్ బియ్యం, మట్టి, ఇసుక రవాణా జరిగినప్పుడు కొంతమంది వ్యక్తులు ట్రాక్టర్లను ఆపి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం ఉందని అన్నారు. ఇలా బెదిరింపులకు పాల్పడుతున్న వారి గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పోలీసు శాఖకు సమాచారం అందించి సహకరించాలని ఆయన కోరారు.




