Wednesday, 4 November 2026

జేఎన్టీయూ యూనివర్సిటీ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

 

 

 

 

 

జేఎన్టీయూ జేఏసీ…కూకట్ పల్లి, ఫిబ్రవరి 09(జనంసాక్షి ):పేరు ప్రఖ్యాతలు గాంచిన జేఎన్టీయూ యూనివర్సిటీ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించే వ్యక్తులపై కట్టిన చర్యలు తీసుకోవాలని జేఎన్టీయూ జేఏసీ చైర్మన్ బొట్ల బిక్షపతి, అధ్యక్షులు మంద రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారంజేఎన్టీయూ జేఏసీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ పరిస్థితులపై తప్పుడు ప్రచారాలపై మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ యూనీవర్సీటిలో కొందరు ప్రొఫెసర్లు, పాత విద్యార్థులు కుమ్మక్కై అడ్మినిస్ట్రేషన్ పదవులు రాలేదని, కొందరు పూర్వ విద్యార్థులు అడ్మిషన్లు రాలేదన్న అక్కసుతో పనిగట్టుకుని కొందరి ప్రోత్సాహంతో, అండదండలతో యూనివర్సిటీకి సంబంధం లేని వ్యక్తులతో మీడియాతో యూనివర్సిటీ మరియు యూనివర్సిటీ అధికారుల మరియు విద్యార్థి సంఘాల పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగిస్తున్నారని అన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కట్టా నరసింహా రెడ్డి,యూనివర్సిటీ అధికారుల సంప్రదింపులతో అడ్మినిస్ట్రేషన్ పదవులు, ప్రొఫెసర్ల బదిలీలు బప్పంద ఉద్యోగ సిబ్బంది కొంత కాలంగా ఒకే స్థానంలో పనిచేస్తున్న విధానాన్ని పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు చేసి యూనివర్సిటీలో ఏ వైస్ ఛాన్సలర్ చేయని విధంగా బదిలీలు చేశారని అన్నారు. యూనివర్సిటీ గర్వించదగ్గ ఫైనాన్స్ సెంట్రలైజేషన్, జాబ్ ఫైయిర్, పూర్వ విద్యార్థులకు ప్రత్యేక డైరెక్టర్ వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. అయినప్పటికీ దానికి సాక్ష్యంగా యూనివర్సిటీలో ప్రొఫెసర్లకు పదవులు కట్టబెట్టాడాన్ని విలేకరుల సాక్షిగా యూనివర్సిటీ ప్రొఫెసర్ల సంఘం సమర్ధిస్తూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కట్టా నరసింహా రెడ్డి నిర్ణయాలను స్వాగతించారు. కాబట్టి యూనివర్సిటీ అధికారుల పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగించే వ్యక్తులపై కటిన చర్యలు తీసుకోవాలని జేయన్టీయుహెచ్ జేఏసీ తరపున యూనివర్సిటీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. యూనివర్సిటీలో విద్యార్థులకు, ప్రొఫెసర్లకు వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు జేఏసీ ముందుంటుంది. త్వరలో రెగ్యులర్ టీచర్ రిక్రూట్మెంట్, బ్యాక్ లాగ్ రిక్రూట్మెంట్, కాంట్రాక్టు ఫ్యాకల్టీ సమస్యలను పరిష్కరించేందుకు జేఏసీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ అధికారుల మరియు ప్రభుత్వ దృష్టికి తీసుకెళతామని తెలిపారు. జేఎన్టీయూ యూనివర్సిటీ జేఏసీ సంఘం, ఇతర సంఘాలపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులెవరైనా భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బల్గర్ సందీప్, వజ్జా వినిత్, సాయిదీపంకర్, ఆదర్శ్ వర్ధన్,కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.