Wednesday, 4 November 2026

ఈ నెల 15 నుండి ప్రజాగోస – బీజేపీ భరోసా యాత్ర

–

 

 

 

 

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావుసూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పాలనను పారద్రోలడానికి ఈ నెల 15 నుంచి సూర్యాపేట నియోజకవర్గంలో ప్రజా గోస బీజేపీ భరోసా యాత్రను చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు తెలిపారు.జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ సూర్యాపేట పట్టణ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ప్రజాగోస బీజేపీ భరోసా ద్వారా కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొడతామన్నారు.పీఎం నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులను ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు.బీఆర్ఎస్ అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోతున్నారని అన్నారు.మంత్రి అభివృద్ధి ముసుగును తొలగించి జరుగుతున్న అవినీతిని నిరూపిస్తామన్నారు.ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమ సూర్యాపేట పట్టణ కన్వీనర్ గా కట్కూరి కార్తీక్ రెడ్డి , సభ్యులుగా వల్దాసు ఉపేందర్, ఆరూరి శివ, కొండేటి ఏడుకొండలు, మీర్ అక్బర్ తోణుకునూరి సంతోష్ , పగిళ్ల సుశీందర్ రెడ్డి, దోసకాయల ఫణినాయుడు, దాసరి వెంకన్న యాదవ్, చెరుకుపల్లి సంజీవ, బొజ్జ పరశురాములు, జల్లి గణేష్, సలీం ,బొల్లం సాంబశివరావులను నియమించారు. నియోజకవర్గ కోఆర్డినేటర్లుగా కర్నాటి కిషన్, సలిగంటి వీరేంద్ర, పల్సా మల్సూర్ గౌడ్, చల్లమల్ల నరసింహ, కొప్పుల క్రాంతి రెడ్డి లను నియమించారు. సూర్యాపేట మండల కన్వీనర్ గా వెన్న శశిధర్ రెడ్డి, సభ్యులుగా ఉప్పు శ్రీనివాస్ ,మొండికత్తి శివాజీ, బోర రమేష్ యాదవ్, బోలగోని బద్రి, ఆరూరి సురేష్ లను నియమించారు.