బేతంచర్ల: కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం పరిధిలోని నాగమల్లకుంట, గూటుపల్లి, తదితర గ్రామాల్లో అక్రమంగా ఇనుప ఖనిజం తవ్వుతున్న స్థావరాలపై జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ వెంకటరెడ్డి గురువారం దాడులు జరిపారు. ఈ దాడుల్లో నాగమల్లకుంట గ్రామ సమీపంలో 1011,1012,410 సర్వే నెంబర్లలలో తవ్వి ఉంచిన వెయ్యి టన్నుల ఇనుప ఖనిజాన్ని సీజ్ చేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.




