– కుటుంబ సభ్యులకు ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల చేయూత
హుజూరాబాద్, మార్చి 6 (జనంసాక్షి) :
పట్టణానికి చెందిన సీనియర్ ఆర్ఎంపీ గ్రామీణ వైద్యుడు కందుకూరి జనార్ధన్ సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మండల ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల సంఘం సభ్యులు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తమ వంతు సహాయంగా 10వేల ఆర్ధిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల సంఘం అధ్యక్షులు పంజాల తిరుపతిగౌడ్, ఉపాధ్యక్షులు సొల్లు మహేందర్, కార్యవర్గ సభ్యులు మహేష్, సతీష్, నవీణ్, ఆర్ఎంపీలు చందర్రావు, రమేష్, నాగరాజు, రాజేంద్రప్రసాద్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.




