హైదరాబాద్: వివాదస్పద గ్రీన్ ఫీల్డ్ భూముల్లో అక్రమకట్టడాల కూల్చివేత స్వల్ప ఉద్రికత్తకు దారితీసింది. ఈ భూముల వ్యవహారం రెండేళ్లుగా న్యాయస్థానంలో ఉండగానే ఇక్కడ వెలిసిన అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై స్థానికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని మాజీ మంత్రి శంకరరావు సోదరుడు దయానంద్ తెలిపారు.




