బెంగళూరు : నాలుగేళ్ల బాలికపై దుండగులు అత్యాచారానికి ఒడిగట్టి అనంతరం దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. మాదివాలలోని రోటరీనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలసమీపంలో గాయాలతో పడి ఉన్న బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. ఆమె మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు.




