– మున్సిపాలిటీలో ఉద్యోగుల ఖాళీలను నింపాలి- మున్సిపాలిటీ టాక్స్ పై శాస్త్రీయబద్ధంగా ప్రజలపై భారం పడకుండా టాక్స్ ఉండాలి- అసెంబ్లీ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి కోరిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుజనంసాక్షి, మంథని :రాష్ర్టంలో ని చాలా మున్సిపాలిటీస్ లో డంపింగ్ యార్డ్ కు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సంబంధించి, వైకుంఠధామాలు సంబంధించి చాలా మున్సిపాలిటీలో ఉద్యోగుల కొరత ఉన్నది. అక్కడున్న కమిషనర్ తో పాటు వివిధ స్థాయిలో ఉద్యోగస్తులు అందరు డిప్యూటేషన్ పై పనిచేస్తున్నారు.
వెంటనే మున్సిపల్ లో ఉన్న ఆ ఖాళీలును పూర్తిస్థాయిలో నింపాలని మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు మున్సిపల్ శాఖ మంత్రిని ప్రభుత్వాన్ని కోరారు. తమ నియోజకవర్గంలో మంథని మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వైకుంఠధామలకు నిధులు కేటాయించాలని కోరారు. మున్సిపాలిటిలో టాక్స్ లను శాస్త్రీయ పద్ధతులను లేకుండా, ఆ ఇంటికి సంబంధం లేకుండా అధిక మొత్తంలో ట్యాక్స్ రూపేనా వసూలు చేయడం వల్ల పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలపై భారం పడకుండా శాస్త్రీయబద్ధంగా ఏ విధంగా ఇతర పద్ధతులలో టాక్స్ తీసుకోవాలని కోరారు. గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా చేసినప్పటి నుండి రికార్డులు సరిగ్గా పెట్టని తరుణంలో మున్సిపాలిటీ వారు పర్మిషన్ ఇచ్చే పద్ధతి గాని ఆక్రమంగా నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మున్సిపల్ శాఖ మంత్రిని కోరారు. పిఎసి సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని గుర్తు చేశారు. మిషన్ భగీరథ ద్వారా మున్సిపాలిటీలలో ఇస్తున్న నీరు వారికి సరిపోడం లేదని, కొంచెం పెంచాలని, కలుషిత నీరు వచ్చిన సందర్భాలు ఉన్నాయని అలా జరగకుండా చూడాలని కోరారు. మెప్మా, వడి లేని రుణాలు అందరికీ వచ్చేలా చేయాలని కోరారు. కొత్త మున్సిపాలిలో రోడ్డు వెడల్పు కార్యక్రమం గానీ , ఇతర అన్ని నిర్ణయాలలో అక్కడున్న ప్రజల అభిప్రాయం తీసుకొని మాస్టర్ ప్లాన్స్ డిజైన్ చేయాలని, రాబోయే కాలంలో ఆ మాస్టర్ ప్లాన్ అనుగుణంగా కార్యచరణ తీసుకోవాలని కోరారు.




