Wednesday, 4 November 2026

అక్రమ మట్టి తవ్వకాలు అడ్డుకున్నందుకు వ్యక్తిపై దాడి

అక్రమ మట్టి తవ్వకాలు అడ్డుకున్నందుకు వ్యక్తిపై దాడి
జనంసాక్షి, హసన్ పర్తి, జనవరి 10: మన తెలంగాణ హసన్పర్తి మండలంలోని మునిపల్లి గ్రామంలో ప్రభుత్వ భూముల్లో, ప్రైవేట్ భూముల్లో సైతం అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టి తరలిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్న హసన్పర్తి పిఎసిఎస్ చైర్మన్ బిల్లా ఉదయ్ కుమార్ రెడ్డి మైనింగ్ పేరిట తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయలు గండి కొడుతూ నా సొంత భూమిలో సైతం అక్రమంగా ప్రవేశించి మొరం తోడుతుండగా అడ్డుకున్నందుకు నాపై దాడి చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఓ బాధితుడు మీడియా ముందట ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం చింతగట్టు గ్రామానికి చెందిన బిల్లా రవీందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ హసన్పర్తి సొసైటీ పిఎసిఎస్ చైర్మన్ అయిన బిల్లా ఉదయ్ కుమార్ రెడ్డి మునిపల్లి గ్రామ శివారులో సర్వేనెంబర్ 157 ,158 లో మొరం తవ్వకాలు చేపట్టారు .ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మొరం తోడుతూ అధికారుల ,టిఆర్ఎస్ నాయకుల అండదండలతో విచ్చలవిడిగా దందా సాగిస్తూ కోట్ల రూపాయలు రాయల్టీని ఎగ్గొడ్తూ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వ భూమి లీజు పేరుతో పక్కనే ఉన్న తమ భూమి సర్వే నెంబర్ 123, 124 భూమిలో సైతం మొరం తవ్వకాలు చేపట్టి అడిగిన వారిపై కక్షకట్టి భౌతిక దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు .మునిపల్లెలో అక్రమంగా నిర్వహిస్తున్న మొరం క్వారీ నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ అనుమతులు లేకున్నా బాంబ్ బ్లాస్టింగ్స్ నిర్వహించడంతో గ్రామంలో ఉన్న పేద దళిత ఇండ్లన్నీ బీటలు వా రూతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతు అవినీతికి పాల్పడుతున్న అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేత అయినా పిఎసిఎస్ చైర్మన్ బిల్లా ఉదయ్ కుమార్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని మీడియా ముఖంగా తెలిపారు, ఇలాంటి వారికి సహకరించే ప్రభుత్వ అధికారులు తీరు మారాలని తెలిపారు .