ముంపు మండలాల ఉపాధ్యాయుల జీతాల రికవరీని ఆపాలి
* టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్
టేకులపల్లి, జనవరి 10 (జనం సాక్షి ): ముంపు మండలాల ఉపాధ్యాయుల జీవితాల రికవరీని ఆపాలని టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు హరిలాల్ నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయడంతో ఆ మండలాల్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత గల ఉపాధ్యాయులను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ పాఠశాలల్లో సర్దుబాటు చేసి,వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా జీతాలు చెల్లించింది. కానీ ఉపాధ్యాయుల యొక్క ప్రమేయం లేకుండా వారికి ఎటువంటి సమాచారం లేకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటి లేదా రెండు నెలల జీతాలను ఉపాధ్యాయుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటి లేదా రెండు నెలల జీతాల కంటే ఎక్కువ నెలల జీతాలు ఉపాధ్యాయుల ఖాతాలలో జమ చేసినట్లు చెబుతూ,ఉపాధ్యాయులకు ఎటువంటి సమాచారం లేకుండా,సమగ్రమైన సమాచారం తెప్పించుకోకుండ డిసెంబర్ నెల జీతాలను రికవరీ పేరుతో నిలుపుదల చేయడాన్ని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్ ఖండించారు. మంగళవారం ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల కోయగూడెంలో జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో వారు మాట్లాడుతూ,ఈ విధంగా ఉపాధ్యాయుల జీతాలను ఆకస్మికంగా నిలుపదల చేయడంతో ఉపాధ్యాయులు ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ,మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఉపాధ్యాయులు వారు వివిధ బ్యాంకులలో తీసుకున్న రుణాల యొక్క ఈఎంఐలు కట్టడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ,పెనాల్టీలు కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. కావున దీనిపై జిల్లా పాలనాధికారి మరియు జిల్లా విద్యాశాఖాధికారి దృష్టి పెట్టి ఉపా




