:శామీర్ పేట్, జనం సాక్షి :తూముకుంట మున్సిపల్ పరిధిలోని దేవరయాంజాల్ గ్రామములో సర్వే నెంబర్లు 639, 640 మరియు 709 లలో అక్రమంగా వెలసిన గుడిసెలకు విద్యుత్ స్థంబాలు మరియు విద్యుత్ మీటర్లు ఏర్పాట్లపై తగు చర్యలు తీసుకోవాలని టి ఎస్ ఎస్ సి డి సి ఎల్ చైర్మన్ మరియు మానేజింగ్ డైరెక్టర్ కు తుంకుంట కాంగ్రెస్ మున్సిపాలిటీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు.639 ,640 మరియు 709 సర్వే నంబర్లల్లో గల ప్రభుత్వము మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన భూమిలో స్థానికేతరులు అక్రమంగా కబ్జా చేసి అక్రమంగా గుడిసెలు వేసుకున్నారు. ఇట్టి గుడిసెలు గల ప్రాంతంలో విద్యుత్ అధికారులు విద్యుత్ స్థంబాలను ఏర్పాటు చేశారు . ఈ విషయమై పలుమార్లు ఎడి ని, మరియు ఎఇ ని ప్రశ్నించగా వారు మాకు ఈ విషయంలో ఏ విధమైన ప్రమేయం లేదని, వారు తమంతట తామే స్థంబాలను ఏర్పాటు చేసుకున్నారని, వారికి విద్యుత్ ఇవ్వకుండా నిలిపివేస్తామని చెప్పారు . కాని ఎలాంటి నిలుపుదల లేకుండా నిరంతరం వారికి విద్యుత్ అందుతూనే ఉన్నది. ఈ సర్వే నెంబర్లలో నకిలీ నోటరీ పత్రాలు తయారు చేసి వాటి ద్వారా ఆన్లైన్లో విద్యుత్ మీటర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
మీటర్లను ఏర్పాటు చేయుటకు గాను లైన్ ఇన్స్పెక్టర్ గాని లైన్ మెన్ గాని పర్యవేక్షించి, ఆమోదం తెలుపుతూ సంతకాలు చేయవలసి ఉంటుంది. కాని ఇందుకు విరుద్ధంగా ఆర్.టి.జె.లు మరియు ఎఇ సంతకం చేసి అనుమతినిస్తున్నారు. ఒక్కో మీటరుకు గాను సుమారుగా 25,000 రూపాయలు విద్యుత్ అధికారులు వసూలు చేయడం శోచనీయ మన్నారు
ఇప్పటికే ఆ గుడిసెల వారి కోసం 25 నుండి 30 మీటర్ల వరకు ఆ ప్రాంతానికి తీసుకువచ్చి పెట్టినారు. అక్రమంగా పొందిన ఈ విద్యుత్ మీటర్ల అనుమతిని రద్దు చేసి, అక్రమ పద్ధతిలో వారి దరఖాస్తులను అమోదించిన వారి పై తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో
తుంకుంట కాంగ్రెస్ మున్సిపాలిటీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, నాయకులు ధర్మా రెడ్డి, మురళి గౌడ్,మల్లేష్ లు పాల్గొన్నారు.




