ఆత్మకూర్ (ఎం) మే 18 (జనంసాక్షి) కూరేళ్ల గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గడ్డం లక్ష్మీనర్సు అనారోగ్యంతో మృతి చెందటంతో వారి కుటుంబాన్ని పరామర్శించిన గ్రామ సర్పంచ్ భాషబోయిన ఉప్పలయ్య యాదవ్ బిఆర్ఎస్ గ్రామశాఖ నాయకులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి 10,000 రూపాయల ఆర్ధిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు ఎరుకల స్వామి సెక్రటరీ జనరల్ గడ్డం అశోక్ ఉపసర్పంచ్ కొమ్మి నరేష్ జిల్లా నాయకులు ఉప్పల నర్సింహ గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి గడ్డం సురేష్ ఎస్సి సెల్ మండల సెక్రటరీ జనరల్ ఉప్పల నర్సింహ మండల విద్యార్థి విభాగం కార్యదర్శి కూరేళ్ల మణి కుమార్ విద్యార్థి విభాగం గ్రామశాఖ అధ్యక్షులు తుమ్మలగూడెం సాయి ఎస్సి సెల్ గ్రామశాఖ అధ్యక్షులు కొమ్ము సురేష్ నార్కట్ పల్లి రవి పొన్నం మత్స్యగిరి నార్కట్ పల్లి నవీన్ కొంపల్లి బిక్షం నార్కట్పల్లి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు




