Wednesday, 4 November 2026

అక్రమ వెంచర్లపై ఆగ్రహం.. ఎంపీటీసీ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

అక్రమ వెంచర్లపై ఆగ్రహం.. ఎంపీటీసీ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

రణరంగంగా మారిన సర్వ సభ్య సమావేశం.

అక్రమాలను నిరసిస్తు ధర్నాకు దిగిన కాంగ్రెస్ శ్రేణులు.

జిల్లాలో తొలిసారిగామండల సర్వసభ్య సమావేశం లో పోలీసుల జోక్యం.

సిరిసిల్ల. జనవరి06.(జనం సాక్షి).. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వేదిక కావలసిన మండల సర్వసభ్య సమావేశం రణరంగంగా మారింది. అక్రమ వెన్చర్లపై ఆగ్రహించిన భారతీయ జనతా పార్టీ ఎంపీటీసీలు నల్ల దుస్తులు ధరించి పోడియం ముందు బైఠాయించి ప్ల కార్డ్ లతో నిరసనకు దిగారు.పోలీసులు జోక్యం చేసుకొని బిజెపి ఎంపీటీసీలను అదుపులోకి తీసుకోవడంతో సమావేశం రణరంగాన్ని తలపించింది.
శుక్రవారం ఎంపీపీ పడిగెల మానస అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభంలోనే గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. మండలంలో వేలుస్తున్న అక్రమ వెంచర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీటీసీలు బైరినేని రాము, రాజిరెడ్డిలు నల్లదుస్తులు ధరించి ప్ల కార్డులు ప్రదర్శిస్తూ పోడియం ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. మండలంలో వెలుస్తున్న అక్రమ వెంచర్లపై అధికార పార్టీ మౌనం పై నిలదీశారు. ఎంపీపీ సర్ధి చెప్పే ప్రయత్నం చేసిన ఆందోళన కొనసాగించారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు బిజెపి ఎంపిటిసిలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. గత నాలుగు నెలలుగా వెంచర్లపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఆందోళనలు చేసిన చర్యలు తీసుకోకపోవడం లేదంటూ బిజెపి ఎంపీటీసీలు ఆరోపించారు. అక్రమ వెంచర్ల వేనుక అధికార పార్టీ నాయకులు ఉన్నారనే చర్యలు తీసుకోవడం లేదని నిరసనలు కొనసాగించారు. సమావేశం కొనసాగించేందుకు అధికార పార్టీ సభ్యులు ఒత్తిడితో ఎంపీపీ పడిగెల మానస పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సమావేశం నుండి ఎంపీటీసీలు రామును, రాజిరెడ్డిలను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులకు బిజెపి ఎంపిటిసి లకు మధ్యతీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. అధికార పార్టీ తీరును బిజెపి ఎంపీటీసీలు తప్పు పట్టారు.మండల సర్వసభ్య సమావేశం లో పోలీసులు జోక్యం చేసుకోవడం ఇదే తొలిసారి.మొత్తంగా సమావేశం రణరంగంగా మారింది. సమావేశంలో డిపిఓ. లచ్చాలు, తహసిల్దార్ సదానందం, సింగిల్ విండో చైర్మన్లు బండి దేవదాస్, భాస్కర్ గౌడ్, ప్రజా ప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.