సులానగర్ ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డుకు శంఖుస్థాపన
టేకులపల్లి, జనవరి 6( జనం సాక్షి ): టేకులపల్లి మండలంలోని సులానగర్ గ్రామంచాయతీ లో ఎస్సీ కాలనీలోని కాలే నరసయ్య బజారు ఆర్ అండ్ బి రోడ్డు నుండి 100 మీటర్ల వరకు సీసీ రోడ్డుకు స్థానిక సర్పంచ్ అజ్మీర బుజ్జి చేతుల మీదుగా శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కోయగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ కోరం ఉమా, వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్, బేతంపూడి సొసైటీ ఛైర్మెన్ లక్కినేని సురేందర్, ఉప సర్పంచ్ ఉండేటి బసవయ్య, పంచాయతీ కార్యదర్శి పవిత్ర, బేతంపూడి సొసైటీ డైరెక్టర్ ఉల్లోజి ఉదయ్, వార్డు మెంబర్లు చింత మల్ల వీరస్వామి, బి ఆర్ ఎస్ నాయకులు అజ్మీర శివ తదితరులు పాల్గొన్నారు.




